Marnus Labuschagne : వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ అరుదైన రికార్డు

Marnus Labuschagne : వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ అరుదైన రికార్డు
X

ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ వన్డేలో అరుదైన రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 315 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్‌ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (154 నాటౌట్) సెంచరీతోపాటు మార్నస్ లబుషేన్ (77 నాటౌట్) జట్టును గెలిపించారు. ఇంగ్లండ్‌పై ఎనిమిది మంది బౌలర్లను ఆసీస్‌ కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రయోగించాడు. ఇందులో లబుషేన్ 3, ఆడమ్ జంపా 3, హెడ్ 2.. షార్ట్, డ్వారిషుస్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కాగా.. ఇందులో మూడు క్యాచ్‌లను లబుషేన్ అందుకొన్నాడు. ఇలా ఒక్క వన్డే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ, మూడు వికెట్లు, మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకొన్న తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనతను సాధించాడు. లబుషేన్‌కు బౌలింగ్‌ బలవంతంగా ఇవ్వాల్సి వచ్చిందని కెప్టెన్ మిచెల్ మార్ష్‌ వ్యాఖ్యానించాడు. ‘మా జట్టులో చాలామంది యువకులు ఉన్నారు. వారిని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంటాం. అయితే, కొంతమందికి గాయాలు కావడం వల్ల లబుషేన్‌తోపాటు ట్రావిస్ హెడ్‌తో బౌలింగ్‌ చేయించాల్సి వచ్చింది. ప్రతిఒక్క క్రికెటర్‌పై నమ్మకం ఉంది’ అని మార్ష్‌ తెలిపాడు.

Tags

Next Story