Australian Cricketer : ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం

Australian Cricketer : ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం
X

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్కస్ స్టొయినిస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న అతడు అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 35 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ 71 వన్డేలు ఆడి 1,495 పరుగులు చేశారు. ఒక సెంచరీతో పాటు 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. మొత్తం 48 వికెట్లు తీశారు.

"దేశం తరఫున అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. ఇంత అంత ఈజీ డెసిషన్ కాదు. కానీ నేను ఇప్పుడు సరైన సమయంలోనే ఆటకు వీడ్కోలు పలికాను. నా కెరీర్ లోని నెక్ట్స్ చాప్టర్ పై ఇక దృష్టి సారిస్తాను. కోచ్ ఆండ్యూ మెక్ డొనాల్డ్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అతడు నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు." అని మార్కస్ పేర్కొన్నాడు.

2015లో ఇంగ్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్టోయినిస్ 71 వన్డేలు ఆడాడు. 64 ఇన్నింగ్స్‌లలో 27 యావరేజ్ తో 1495 పరుగులు చేశాడు. తన అత్యధిక స్కోర్ 146 నాటౌట్. 2019 లో న్యూజిలాండ్ పై లోయర్ ఆర్డర్ సహాయంతో అతను ఆడిన 146 పరుగుల ఇన్నింగ్స్ వన్డే చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్. బౌలింగ్ లోనూ రాణించి 48 వికెట్లు పడగొట్టాడు. 35 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్ 2024న పెర్త్‌లో పాకిస్థాన్‌తో తన చివరి వన్డే ఆడాడు. 2023 ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు.

Tags

Next Story