Yashaswi Jaiswal : యశస్వి జైస్వాల్ కే మా సపోర్ట్ : స్మిత్

టీమ్‌ఇండియా నుంచి ఫ్యూచర్ లో స్టార్ బ్యాట్స్ మెన్ ఎవరు అవుతారన్న ప్రశ్నకు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఇంట్రెస్టింగ్ గా సమాధానం ఇచ్చారు. అన్ని ఫార్మాట్లలో బెటర్ పర్ఫామెన్స్ చేస్తున్న యశస్వి జైస్వాల్ వైపు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇంట్రెస్ట్ చూపించారు. టీమ్‌ఇండియాలో తదుపరి సూపర్‌స్టార్‌గా ఎదిగే క్రికెటర్ ఎవరంటూ పలువురు ఆస్ట్రేలియా ప్లేయర్లను ఓ స్పోర్ట్స్ చానెల్ ప్రశ్నించింది. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లయన్, అలెక్స్ కారే.. యశస్వి జైస్వాల్ పేరును ఎంచుకున్నారు. సూపర్‌స్టార్ అయ్యే అవకాశాలు అతడికే ఉన్నాయని స్మిత్ పేర్కొనగా.. మిగతా వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఆసీస్ ఆటగాళ్లలో ఎక్కువమంది టీమ్‌ఇండియా క్రికెట్ సంచలనంగా జైస్వాల్‌కే మద్దతు పలికారు. అన్ని ఫార్మాట్లు ఆడగల అద్భుత క్రికెటర్ అని కొనియాడారు.మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. వారు ఇందుకు శుభ్‌మన్ గిల్ ను ఎంపిక చేశారు. ఆటలో గిల్ టెక్నిక్ బాగుంటుందని గ్రీన్ ప్రశంసించగా.. బౌలర్లపై అతడు ఆధిపత్యం చెలాయిస్తాడని హెడ్ మెచ్చుకున్నాడు. అయితే, జైస్వాల్ ఇప్పటివరకూ టెస్టుల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోలేదు. గిల్ మాత్రం ఆసీస్‌పై మంచి ప్రదర్శనే చేశాడు. 2020లో మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టుతో గిల్ టెస్టుల్లో అరంగేట్రం చేయగా.. ఆసీస్‌పై ఏడు వన్డేల్లో 272 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లోకి 2023లో అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వెస్టిండీస్‌పై 171 రన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మొత్తం 712 రన్స్ చేశాడు. ఒకే సిరీస్‌లో 700కుపైగా పరుగులు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. టీ20లోనూ యశస్వి అదరగొట్టాడు. 23 టీ20 మ్యాచ్ లు ఆడి 723 రన్స్ చేశాడు. టీమిండియా ఈనెల 19 నుంచి బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే న్యూజిలాండ్‌తో టెస్టులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత నవంబర్‌లో జరిగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com