Rohit Sharma : రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Rohit Sharma : రోహిత్ శర్మ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
X

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరిగే ఐదో టెస్టు నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులో కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచుకు తాను దూరంగా ఉంటానని హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌కు స్వయంగా రోహితే చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపు స్పష్టత రానుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

చివరి టెస్టుకు రోహిత్ శర్మ దూరమవుతారని వస్తోన్న వార్తలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఈ దశలో పోరాడాలి. అతను బయటకు రావాలని కోరుకోవట్లేదు. భారత క్రికెట్‌కు రోహిత్ ఎంతో చేశారు. ఈ పరిస్థితులను తిప్పికొట్టే సామర్థ్యం ఆయనకు ఉంది. ఇది సిరీస్‌లో కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సిరీస్ తర్వాతే బయటకు రావాలి’ అని ఆయన సూచించారు.

Tags

Next Story