IPL 2025 : బెంగళూరు సూపర్ షో.. క్వాలిఫయర్-1లో పంజాబ్ తో ఢీకి రెడీ

IPL 2025 : బెంగళూరు సూపర్ షో.. క్వాలిఫయర్-1లో పంజాబ్ తో ఢీకి రెడీ
X

ఐపీఎల్-2025 సీజన్ లీగ్ దశ పోటీలు ముగిశాయి. ఇక రేపటి నుంచి క్వాలిఫయర్ పోటీలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాటు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో దూసుకెళ్లి క్వాలిఫయర్ మ్యాచ్ కు అర్హత సాధించింది. గురువారం జరిగే క్వాలియర్-1 పోరులో టాప్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ - ఆర్సీబీ ఢీ కొననుంది. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై, గుజరాత్ జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నాయి.

మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (118) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు) ఆకాశమే హద్దుగా విజృంభించాడు. అనంతరం భారీ పరుగుల ఛేదనకు దిగిన ఆర్సీబీ 18.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు విరాట్ కోహ్లి (54) రన్స్ చేశాడు.

Tags

Next Story