Ban vs Pak : బంగ్లాదేశ్.. అదుర్స్.. టెస్టుల్లో తొలిసారి పాకిస్థాన్ పై గెలుపు

X
By - Manikanta |26 Aug 2024 5:00 PM IST
పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. టెస్టుల్లో తొలిసారి పాక్‌ను ఓడించి విజయాన్ని అందుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. సొంతగడ్డపై పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగానూ రికార్డు సృష్టించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 448/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 565 చేసి ఆలౌటైంది. ఆదివారం సెకండ్ ఇన్నింగ్స్ ఓవర్‌నైట్ స్కోరు 23/1తో కొనసాగించిన పాకిస్థాన్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల ఈజీ టార్గెట్ ను బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పూర్తిచేసింది. దీంతో బంగ్లాదేశ్.. పాక్ పై గెలిచింది. రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ 1–0 లీడ్ లోకి వెళ్లింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com