Basit Ali : అతడి వల్లే పాక్ ఓడిపోయింది.. బసిత్ అలీ ఆగ్రహం

పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫిక్‌పై ఆ దేశ మాజీ ప్లేయర్ బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షఫిక్ ఔటవ్వడం వల్లే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలైందని విమర్శించాడు. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టులో పాక్‌కు బంగ్లా షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో 448/6 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 565 పరుగులకు ఆలౌటై 117 రన్స్ ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్ చివరి రోజు పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. మహ్మద్ రిజ్వాన్ (51) రాణించగా.. షఫిక్ (37) కీలక సమయంలో ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేదు.‘ఒకవేళ నేను పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంటే అబ్దుల్లా షఫిక్‌ని బ్యాగ్‌లు సర్దుకుని ఇంటికి వెళ్లమని చెప్పేవాడిని. అతడు నిర్లక్ష్యంగా షాట్ ఆడటం వల్లే పాక్ మ్యాచ్ ఓడిపోయింది. 37 రన్స్ చేసిన తర్వాత పేలవమైన షాట్ ఆడి ఔటయ్యాడు’అని బసిత్ ఫైర్ అయ్యాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com