Ind vs Eng : మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Ind vs Eng : మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే మిగితా మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను కూడా జట్టులో ఉంచారు.ఫిట్ నెస్ బట్టి జడేజా, రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కలేదు.

విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు తర్వాత అయ్యర్ కు వెన్ను, గజ్జల్లో నొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. దీంతో పాటు భారత జట్టులో అవేశ్ ఖాన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ ఎంపికయ్యాడు. ఆకాశ్ దీప్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ పై అద్భుతంగా బౌలింగ్ చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.

తొలి టెస్టులో ఓడినా రెండో టెస్టులో గెలిచి లెక్క సరి చేసిన టీమిండియా మూడో టెస్టుకు రెడీ అవుతుంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 15న మొదలవనుంది. రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ తర్వాత తమ ఇండ్లకు వెళ్లిపోయిన టీమిండియా ప్లేయర్లు మూడో టెస్టు కోసం ఆదివారం రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌ చేరుకోనున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్.సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్

Tags

Read MoreRead Less
Next Story