India-England Test Series : ఇంగ్లండ్ టూర్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

India-England Test Series : ఇంగ్లండ్ టూర్.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

భారత్-ఇంగ్లండ్ టీమ్స్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్‌ నుంచి ఆగస్ట్ మధ్య ఈ సిరీస్‌ జరగనుంది. రెండు జట్ల మధ్య చివరిసారిగా ఆ దేశంలో 2021లో ఐదు టెస్టుల సిరీస్‌ జరిగింది. దీనిని 2-2తో సమంగా పంచుకున్నాయి. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. ఇప్పుడీ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫోర్త్ సైకిల్‌ ప్రారంభం కానుంది.ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఫస్ట్ టెస్ట్ జూన్ 20 నుంచి 24 వరకు, సెకండ్ టెస్ట్ జులై 2 నుంచి 6 వరకు, థర్డ్ టెస్ట్ జులై 10 నుంచి 14 వరకు, ఫోర్త్ టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు, ఫిఫ్త్ టెస్ట్ జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరగనుంది. వచ్చే ఏడాది జూన్‌-జులై మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

Tags

Next Story