BCCI : ఒలింపిక్స్ టీంకు బీసీసీఐ నజరానా.. ఎందుకో తెలుసా?

BCCI : ఒలింపిక్స్ టీంకు బీసీసీఐ నజరానా.. ఎందుకో తెలుసా?

విశ్వక్రీడల అతిపెద్ద సమరం పారిస్ ఒలింపిక్స్ మరో 4 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనేందుకు భారత్ నుంచి కూడా మొత్తం 117 మంది క్రీడాకా రులు వివిధ క్రీడాంశాల్లో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు.

అందులో కొంత మంది ఇప్పటికే క్రీడా నగరం పారిస్ కు చేరుకున్నారు. అయితే ఈసారి ఒలింపిక్స్ లో పాల్గొనే భారత అథ్లెట్లకు మద్దతుగా నిలిచేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ముందుకు వచ్చింది. అథ్లెట్లకు ప్రోత్సాహకంగా భారత ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ)కు రూ. 8.5 కోట్లు అందిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.

భారత అథ్లెంట్లందరికి ఆల్ ది బెస్ట్.. భారత్ ను గర్వించేలా చేయండి జై హింద్ అని జై షా చెప్పడం విశేషం. త్వరలోనే ఒలింపిక్స్ లో క్రికెట్ క్రీడను చేర్చే అవకాశం ఉంది. భారత్ లో ఒలింపిక్స్ కు సపోర్ట్ గా బీసీసీఐ ఇప్పుడు సాయానికి ముందుకు రావడం విశేషం.

Tags

Next Story