BCCI : ఐపీఎల్ తో బీసీసీఐకు భారీ ఆమ్దానీ
బీసీసీఐకి ఐపీఎల్ తో భారీగా ఆమ్దానీ వస్తోంది. ఐపీఎల్ 2022 సీజన్‌తో పోలిస్తే 2023 లో మిగులు సంపాదనలో 116 శాతం పెరుగుదల కనిపించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ 2022లో రూ.2,367 కోట్లు ఉండగా.. మరుసటి ఏడాదికి రూ.5,120 కోట్లకు చేరింది. అలాగే ఐపీఎల్ 2023 ఆదాయం రూ.11,769 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 78 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో ఖర్చులు కూడా 66 శాతం పెరిగి రూ.6,648 కోట్లకు చేరాయి. ఐపీఎల్ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్ ఒప్పందాల వల్లే భారీగా మిగులు కనిపించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 2023-27 సీజన్ కోసం మీడియా హక్కుల ద్వారా రూ.48,390 కోట్లు బీసీసీఐకి వచ్చాయి. ఇందులో ఐపీఎల్ టీవీ హక్కుల ద్వారా రూ.23,575 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్ తో రూ. 23,758 కోట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ హక్కులను టాటా సన్స్ రూ. 2,500 కోట్లకు తీసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com