సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బ.. పోలీసు కేసులో ఇరుక్కున్న స్టార్ ఆటగాడు

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద దెబ్బ.. పోలీసు కేసులో ఇరుక్కున్న స్టార్ ఆటగాడు
హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మకు పోలీసులు సమన్లు జారీ చేశారు.

అభిషేక్ శర్మకు పోలీసులు సమన్లు జారీ చేశారు. మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మకు పాత్ర ఉందేమో అని అనుమానంతో పోలీసులు సమన్లు ​​జారీ చేశారు. తానియా సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అభిషేక్ శర్మతో చివరిసారి ఫోన్‌లో మాట్లాడిందని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. దీంతో పోలీసులు అతడికి విచారణ నిమిత్తం సమన్లు ​​పంపారు.

మోడల్ తానియా ఆత్మహత్యాయత్నం: IPL 2024 ప్రారంభానికి ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సమస్యలు పెరుగుతున్నాయి. సూరత్ పోలీసులు ఈ ఫ్రాంచైజీకి చెందిన ప్లేయర్‌ని విచారణ కోసం పిలిచారు. ఫిబ్రవరి 20 అర్థరాత్రి, సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య చేసుకుంది.

తానియా సింగ్ ఫిబ్రవరి 20 రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత ఉదయం చూసేసరికి మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు చివరిసారిగా అభిషేక్ శర్మతో ఫోన్‌లో మాట్లాడింది. తానియా సింగ్, అభిషేక్ శర్మల ప్రేమ వ్యవహారం కోణం నుండి పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే వారిద్దరికీ ఎంతో కాలం పరిచయం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు.

అభిషేక్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు

ఓపెనర్ అభిషేక్ శర్మ 2019 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. అతను ఇప్పటివరకు 47 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 893 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడినందుకు అతనికి రూ.6 కోట్ల 50 లక్షలు అందుతాయి. తానియా కేసు విచారణలో భాగంగా ఒకవేళ అభిషేక్ ఈ సీజన్‌కు దూరమైతే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి పెద్ద దెబ్బే.

తానియా సింగ్ ఎవరు?

28 ఏళ్ల తానియా సింగ్ సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్. నివేదికల ప్రకారం.. అభిషేక్ శర్మ మరియు తానియా సింగ్‌ల మొదటి సమావేశం మ్యాచ్ సమయంలో జరిగింది. అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడేందుకు సూరత్ వెళ్లినప్పుడు ఆమె పరిచయం అయ్యింది. ఆ తరువాత ఇద్దరూ స్నేహితులయ్యారు. తానియా సింగ్ ఫ్యాషన్ డిజైనర్ గా, మోడల్ గా పనిచేసేది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 10 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story