IPL Opening Ceremony : ఐపీఎల్ కు బాలీవుడ్ స్టార్లు.. ఈసారి సరికొత్తగా

IPL Opening Ceremony : ఐపీఎల్ కు బాలీవుడ్ స్టార్లు.. ఈసారి సరికొత్తగా
X

ఐపీఎల్ 18వ సీజన్ ఈనెల 22న షురూ కానుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్లు మెరవనున్నట్లు సమాచారం. షారుఖ్ ఖాన్, సల్మాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ వచ్చే చాన్స్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్, దిశా పటానీ స్పెషల్ డ్యాన్స్ లతో సందడి చేయనున్నారు. అయితే వీరితో పాటే మరికొంతమంది అందమైన భామలు కూడా రాబోతున్నారట. అంతేకాకుండా, పంజాబ్ స్టార్ ర్యాపర్ కరణ్ ఔజ్లా ప్రత్యేక షో చేయనున్నారు. అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ప్రదర్శన కోసం ఆ బృందాన్ని సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈసారి కొత్తగా

ఈసారి టోర్నీకి మొత్తం 13 స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ప్రతీ ఏడాది టోర్నీలో తొలి మ్యాచు మాత్రమే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. కానీ, ఈసారి టోర్నీకి వేదిక కానున్న అన్ని స్టేడియాల్లో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించాలని బోర్డు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా స్టేడియాల్లో జరగనున్న తొలి మ్యాచ్లో ఈవెంట్ ఉంటుందని తెలిసింది. ఓపెనింగ్ మ్యాచ్ కు కాకుండా ప్రతీ స్టేడియంలో ప్రేక్షకులు ఈ అనుభూతి పొందేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Tags

Next Story