Bumrah and Smriti Mandhana : బుమ్రా, మంధాన అరుదైన ఘనత

Bumrah and Smriti Mandhana : బుమ్రా, మంధాన అరుదైన ఘనత
X

క్రికెట్ బైబిల్‌గా పిలిచే ‘విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్-2025 ఎడిషన్’ ఇవాళ ప్రచురితమైంది. ఇందులో వరల్డ్ లీడింగ్ మెన్స్ క్రికెటర్‌గా భారత స్టార్ బౌలర్ బుమ్రా, ఉమెన్స్ క్రికెటర్‌గా బ్యాటర్ మంధాన నిలిచారు. ఒకేసారి ఇద్దరు భారత ఆటగాళ్లు ఇందులో చోటు దక్కించుకోవడం విశేషం. మరోవైపు వరల్డ్ లీడింగ్ T20 ప్లేయర్‌గా వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా వీరిని ఎంపిక చేశారు.

విజ్డెన్‌ వుమెన్స్‌ లీడింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డు విషయానికొస్తే.. 2024 సంవత్సరానికి గానూ ఈ అవార్డును భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధన దక్కించకుంది. మంధన గతేడాది మూడు ఫార్మాట్లలో విశేషంగా రాణించి, రికార్డు స్థాయిలో 1659 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో ఇన్ని పరుగులు ఎవరూ చేయలేదు. గతేడాది మంధన నాలుగు వన్డే శతకాలు, ఓ టెస్ట్‌ సెంచరీ సాధించింది.

క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్న విండీస్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌కు విజ్డెన్‌ మెన్స్‌ లీడింగ్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ అవార్డు లభించింది. పూరన్‌ గతేడాది పొట్టి ఫార్మాట్‌లో 21 మ్యాచ్‌లు ఆడి 142.22 స్ట్రయిక్‌రేట్‌తో 464 పరుగులు చేశాడు.

Tags

Next Story