TEAM INDIA: భారత జట్టు కెప్టెన్‌గా రోహిత్

ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు. ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతున్న రోహిత్ శర్మపై టీమిండియాను నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు. ఈ సిరీస్ లో సారధిగా హిట్ మ్యాన్ వ్యవహరించనుండగా... శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉండనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తెలుగు తేజం నితీశ్ కు చోటు దక్కలేదు.
నితీశ్ రెడ్డికి నిరాశ
తెలుగు తేజం నితీశ్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీలో నిరాశ ఎదురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న నితీశ్‌కు తాజాగా ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ఆసీస్‌పై సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న నితీశ్‌ను చాంఫియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని అందరూ భావించారు. మంచి ఫామ్‌లో ఉన్న నితీశ్‌కు భారత జట్టులో స్థానం కల్పించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
సిరాజ్‌కు బీసీసీఐ అన్యాయం!
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు అన్యాయం జరిగిందని తెలుగు వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ఇన్నాళ్లుగా అందిస్తున్న సేవలకు ఫలితమే లేకుండా పోయిందటున్నారు. యంగ్‌స్టర్స్ మీద నమ్మకం ఉంచిన బీసీసీఐ.. సిరాజ్ మ్యాజిక్‌పై మాత్రం భరోసా ఉంచలేదు. వన్డేల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొన్నాళ్లు అందర్నీ హడలెత్తించాడు. ఫామ్, ఫిట్‌నెస్.. ఇలా ఏది చూసుకున్నా అతడికి అతడే సాటి అనేలా ఉన్నాడు.
సంజూ శాంసన్‌కు బీసీసీఐ షాక్!
భారత యువ ప్లేయర్ సంజూ శాంసన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. సంజూ విజయ్ హజారే ట్రోఫీకి ఎందుకు పాల్గొనలేదనే విషయంపై విచారించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఏ కారణం చెప్పకుండా విజయ్ హజారే ట్రోఫీకి దూరంగా ఉన్న సంజు.. గత కొంతకాలంగా దుబాయ్‌లో గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజూ తీరుపై తీవ్ర అసహనంగా ఉన్న బీసీసీఐ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
బుమ్రా ఐదు వారాలు అడిగాడు: అగార్కర్
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్టార్ బౌలర్ బుమ్రా ఐదు వారాల విరామం అడిగాడని BCCI చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ అన్నారు. ‘ఇంగ్లండ్‌తో తొలి రెండు వన్డేలకు బుమ్రా అందుబాటులో ఉండడు. ఒకవేళ మూడో మ్యాచ్‌కు సిద్ధమైతే ఆడతాడు. లేకపోతే నేరుగా CT బరిలో దిగుతాడు. ఫిబ్రవరి మొదటి వారంలో బుమ్రా ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ రానుంది. ఇక ప్రతి క్రికెటర్‌ను దేశవాళీలో ఆడాలని చెప్పడం వెనుక చాలా కారణాలు ఉంటాయి’ అని వెల్లడించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ: పూర్తి టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సంబంధించి భారత జట్టును చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. రోహిత్ శర్మ (C), గిల్(VC), జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, పంత్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com