Captain Rohit Sharma : కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో అత్యంత వేగంగా 9వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్‌గా ఆయన నిలిచారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో పరుగుల ఖాతా తెరిచి ఈ మైలురాయి చేరుకున్నారు. 181 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సచిన్(197), గంగూలీ(231), గేల్(246), గిల్ క్రిస్ట్(253), జయసూర్య(268) ఉన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియాకు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ గొప్ప విజయాన్ని అందుకుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ కంగ్రాట్స్ తెలియజేశారు. అద్భుతమైన మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించడం మరచిపోలేని అనుభూతి అని చిరంజీవి, మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com