Sports Budget : స్పోర్ట్స్ బడ్జెట్ పెంచిన కేంద్రం.. రూ.3,442 కోట్లు కేటాయింపు

Sports Budget : స్పోర్ట్స్ బడ్జెట్ పెంచిన కేంద్రం.. రూ.3,442 కోట్లు కేటాయింపు

2024-25 ఆర్థిక సంవత్సరానికి సం బంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో క్రీడా రంగానికి రూ.3442.32 కోట్లు కేటాయించారు. అయితే గత ఆర్థిక బడ్జెట్ కంటే కేవలం రూ.45.36 కోట్లు అదనంగా కేటాయించడం జరిగింది.

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నెళ్లుగా ఖేలో ఇండియా పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి వార్షిక బడ్జెట్లో ఖేలో ఇండియా కోసం ఏకంగా రూ. 900 కోట్లు కేటాయించారు. మరోవైపు స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు రూ. 822.60 కోట్లు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు రూ. 340 కోట్లు కెటాయించారు.

నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కు 22.30 కోట్లు, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్టిటిఎల్)కు రూ. 22 కోట్లు కేటాయించారు.

Tags

Next Story