Chahal : కౌంటీలో అదరగొడుతున్న చాహల్

Chahal : కౌంటీలో అదరగొడుతున్న చాహల్
X

టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంగ్లండ్‌ గడ్డపై అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ లో కౌంటీ చాంపియన్‌షిప్‌ జరుగుతోంది. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌ జట్టుకు చాహల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. మంగళవారం డెర్బీషైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చాహల్ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డెర్బీషైర్‌ను చాహల్ స్పిన్‌తో బెంబేలెత్తించాడు. దీంతో డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో డెర్బీషైర్ 150/4 స్కోరుతో మంచి స్థితిలోనే ఉండగా చాహల్ వరుస వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. కేవలం 15 పరుగుల వ్యవధిలోనే ప్రత్యర్థిని కూల్చేశాడు. 16.3 ఓవర్లు వేసిన చాహల్ 2.73 ఎకానమీతో 45 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన నార్తంప్టన్‌షైర్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 178/5 స్కోరు చేసి.. 232 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Tags

Next Story