IND vs SL : చరిత్ అసలంక కెప్టెన్సీలో శ్రీలంక టీ20 జట్టు ప్రకటన
మరికొన్ని రోజుల్లో భారత్ సొంతగడ్డపై జరగనున్న టీ20 సిరీస్ కోసం లంక జట్టును ప్రకటించారు. ఈ నెల 27 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ -టీ20 సిరీస్ మొదలు కానుంది. అనంతరం ఇరు జట్ల మధ్య -ఆగస్టు 2 నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. పొట్టి సిరీస్ కోసం లంక క్రికెట్ బోర్డు -మంగళవారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఈ జట్టుకు చరిత్ అసలంక సారథ్యం వహిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఓడిన తర్వాత లంక మాజీ కెప్టెన్ వనిందు హసరంగా కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగే ఈ సిరీస్ లో హసరంగా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. పొట్టి సిరీస్ కోసం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును లంక సెలక్టర్లు ఎంపిక చేశారు. దాంతో సీనియర్లు ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, సమరవిక్రమ, దిల్షా న్ మధుశంకలకు అవకాశం లభించలేదు. దినేశ్ చండీమాల్, కుశాల్ పెరీరా మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు చమిందు విక్రమసింఘే, బినురా ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండోలకు కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
శ్రీలంక టీ20 జట్టు : చరిత్ అసలంక (కెప్టెన్), పాథుమ్ నిశాంక, కుశాల్ జనిత్ పెరీరా (వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాం. డో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), దినేశ్ చండీమల్, కమిందు మెండిస్, దాసున్ శనక, వనిందు హసరంగా, దునిత్ వెల్ల లాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీశా పతిరణ, నువాన్ తుషారా, దుష్మంత చమీరా, బినూర ఫెర్నాండో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com