COMMONWEALTH: భారత్‌లోనే అంతర్జాతీయ క్రీడా సంబరం

COMMONWEALTH: భారత్‌లోనే అంతర్జాతీయ క్రీడా సంబరం
X

దేశ క్రీ­డా­రం­గా­ని­కి భారీ శు­భ­వా­ర్త వి­ని­పిం­చే అవ­కా­శం కని­పి­స్తోం­ది. దా­దా­పు రెం­డు దశా­బ్దాల సు­దీ­ర్ఘ ని­రీ­క్షణ తర్వాత దేశం మరో ప్ర­తి­ష్టా­త్మక క్రీ­డా­టో­ర్నీ ఆతి­థ్యా­ని­కి సి­ద్ధం కా­బో­తుం­ది. 2030 కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌ ఆతి­థ్య నగర పో­టీ­లో అహ్మ­దా­బా­ద్‌ ముం­దం­జ­లో ని­లి­చిం­ది. ఈ మే­ర­కు 2030లో జరి­గే వం­దేం­డ్ల కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌­కు ఆతి­థ్య నగ­రం­గా అహ్మ­దా­బా­ద్‌­ను సి­ఫా­ర­సు చే­స్తూ స్పో­ర్ట్స్‌ ఎగ్జి­క్యూ­టి­వ్‌ బో­ర్డు కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ తీ­ర్మా­నా­న్ని పూ­ర్తి స్థా­యి సభ్య­దే­శా­ల­కు పం­పిన తర్వాత నవం­బ­ర్‌ 26న గ్లా­స్గో­లో జరి­గే జన­ర­ల్‌ అసెం­బ్లీ­లో తుది ని­ర్ణ­యం తీ­సు­కో­ను­న్నా­రు. కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌ ఆతి­థ్య హక్కుల కోసం అబు­జా(నై­జీ­రి­యా) పో­టీ­ప­డు­తు­న్నా..మె­జా­ర్టీ సభ్యు­లు అహ్మ­దా­బా­ద్‌ వైపే మొ­గ్గు­చూ­పా­రు. ఒక­వేళ భా­ర­త్‌­కు ఆతి­థ్య హోదా దక్కి­తే 2036 ఒలిం­పి­క్స్‌ ని­ర్వ­హ­ణ­లో మరో కీలక అడు­గు పడి­న­ట్లు అవు­తుం­ది.

అబుజాతో అహ్మదాబాద్‌ పోటీ

2030 నా­టి­కి సరి­గ్గా వం­దేం­డ్లు పూ­ర్తి చే­సు­కో­బో­తు­న్న కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌ కోసం భా­ర­త్‌­లో­ని అహ్మ­దా­బా­ద్‌­తో పాటు నై­జీ­రి­యా­లో­ని అబు­జా నగరం పో­టీ­ప­డ­తు­న్న­ది. అయి­తే ఓవై­పు అబు­జా ఆతి­థ్య పో­టీ­ని సమ­ర్థి­స్తూ­నే ఎగ్జి­క్యూ­టి­వ్‌ బో­ర్డు అహ్మ­దా­బా­ద్‌ వైపు మొ­గ్గు­చూ­పిం­ది. 2034గే­మ్స్‌­కు ఆతి­థ్య­మి­చ్చేం­దు­కు ఆ దే­శా­ని­కి మద్ద­తు­గా ప్ర­ణా­ళి­క­లు రూ­పొం­దిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. ఆఫ్రి­కా­లో కా­మ­న్వె­ల్త్‌ ని­ర్వ­హిం­చా­ల­న్న తమ ని­బ­ద్ద­త­కు ఇది ని­ద­ర్శ­న­మ­ని పే­ర్కొం­ది.

పీటీ ఉష హర్షం

కా­మ­న్వె­ల్త్ గే­మ్స్ మె­జా­ర్టీ సభ్య దే­శా­లు భా­ర­త్ వైపే మొ­గ్గు చూ­ప­డం­పై పీటీ ఉష హర్షం వ్య­క్తం చే­శా­రు. ‘భా­ర­త్‌­తో పాటు నై­జీ­రి­యా ప్ర­తి­పా­ద­న­లు స్ఫూ­ర్తి­దా­య­కం­గా ఉన్నా­యి. అన్ని అం­శా­ల­ను పరి­శీ­లిం­చిన తర్వాత అబు­జా కంటే అహ్మ­దా­బా­ద్‌­కే సభ్యు­లు మొ­గ్గు­చూ­పా­రు’ అని కా­మ­న్వె­ల్త్‌ స్పో­ర్ట్స్‌ తా­త్కా­లిక అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్‌ పే­ర్కొ­న్నా­డు. ఇది­లా ఉంటే వం­దేం­డ్ల కా­మ­న్వె­ల్త్‌­గే­మ్స్‌­కు ఆతి­థ్య­మి­వ్వ­డం భా­ర­త్‌­కు దక్కిన గొ­ప్ప గౌ­ర­మ­ని జా­తీయ ఒలిం­పి­క్‌ అసో­సి­యే­ష­న్‌(ఐవోఏ) అధ్య­క్షు­రా­లు పీటీ ఉష హర్షం వ్య­క్తం చే­సిం­ది. కా­మ­న్వె­ల్త్‌ ఆతి­థ్యం ద్వా­రా భారత క్రీ­డా సత్తా ఏంటో ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్ప­వ­చ్చ­ని పే­ర్కొం­ది. దే­శం­లో­ని మౌ­లిక క్రీ­డా వస­తుల కల్ప­న­కు కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌ దో­హ­దం చే­స్తా­య­ని తె­లి­పిం­ది.

ఒలింపిక్సే లక్ష్యంగా..

కా­మ­న్వె­ల్త్‌ క్రీ­డల ని­ర్వ­హణ కోసం దే­శా­లు ఆస­క్తి­నీ ప్ర­ద­ర్శిం­చ­ట్లే­దు. 2022 సీ­డ­బ్ల్యూ­జీ క్రీ­డ­ల­కు డర్బ­న్‌ (దక్షి­ణా­ఫ్రి­కా) ఆతి­థ్య­మి­వ్వా­ల్సిం­ది. ని­ర్వ­హణ వ్య­యా­న్ని భరిం­చ­లేక ఆ నగరం వై­దొ­ల­గ­డం­తో బర్మిం­గ్‌­హా­మ్‌ (ఇం­గ్లాం­డ్‌) ఆతి­థ్య­మి­చ్చిం­ది. 2026 క్రీ­డ­లు ని­జా­ని­కి ఆస్ట్రే­లి­యా­లో­ని వి­క్టో­రి­యా­లో జర­గా­ల్సిం­ది. కానీ ఖర్చు ఎక్కు­వ­వు­తుం­ద­న్న ఉద్దే­శం­తో వా­ళ్లూ ఆతి­థ్య హక్కు­ల­ను వదు­లు­కు­న్నా­రు. దీం­తో గ్లా­స్గో ముం­దు­కొ­చ్చిం­ది. . ఇలాం­టి పరి­స్థి­తు­ల్లో­నూ క్రీ­డల ని­ర్వ­హ­ణ­కు భా­ర­త్‌ ఆస­క్తి­ని ప్ర­ద­ర్శిం­చ­డా­ని­కి కా­ర­ణం 2036 ఒలిం­పి­క్సే. వి­శ్వ­క్రీ­డ­ల­కు ఆతి­థ్య­మి­వ్వా­ల­న్న కలను నె­ర­వే­ర్చు­కో­వా­ల­ను­కుం­టు­న్న భా­ర­త్‌.. ఈ లోపు కా­మ­న్వె­ల్త్‌ గే­మ్స్‌­ను వి­జ­య­వం­తం­గా ని­ర్వ­హిం­చి సత్తా చా­టా­ల­ను­కుం­టోం­ది.

Tags

Next Story