ఆల్కహాల్ ఓవర్ డోస్ కారణంగా క్షీణించిన మాక్స్‌వెల్ ఆరోగ్యం

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn maxwell) శుక్రవారం రాత్రి అడిలైడ్‌లోని (Adelaide) ఆసుపత్రిలో చేరాడు. నివేదికల ప్రకారం, అతను ఆ రోజు అడిలైడ్‌లో రాత్రంతా పార్టీ చేసుకున్నాడు ,చాలా మద్యం సేవించాడు. అనంతరం అతని ఆరోగ్యం క్షీణించడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) విచారణ జరుపుతోంది. వెస్టిండీస్‌తో సోమవారం జరగనున్న వన్డే సిరీస్‌లో మాక్స్‌వెల్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. 3 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమవుతుంది, ఇందులో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా (Steve smith) వ్యవహరిస్తాడు.
డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం సంఘటన జరిగినప్పుడు, బ్రెట్ లీ రాక్ బ్యాండ్ 'సిక్స్ అండ్ అవుట్' చూడటానికి వెళ్ళాడు . అక్కడకు వచ్చిన మాక్స్‌వెల్ విపరీతంగా మద్యం సేవించాడు. దీంతో అతను అస్వస్థతకు గురయ్యాడు. అక్కడ ఉన్నవారు అంబులెన్స్‌ని పిలిపించి అతనిని ఆసుపత్రికి తరలించారు.
ప్రపంచకప్ (World cup) కారణంగా మ్యాక్స్‌వెల్‌కు విశ్రాంతి..
సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న గ్లెన్ మాక్స్‌వెల్ స్థానంలో ఫ్రేజర్ మగార్క్‌కు (Jake Fraser-mcgar) వన్డే జట్టులో అవకాశం కల్పించారు. టీ20 వరల్డ్‌కప్, టీ20 సిరీస్‌లకు ముందు మాక్స్‌వెల్‌కు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ దృష్ట్యా విశ్రాంతి ఇచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కంగారూ జట్టు ఫిబ్రవరిలో వెస్టిండీస్ ,న్యూజిలాండ్‌లతో టి-20 సిరీస్‌ను కూడా ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు:
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), షాన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, జాక్ ఫ్రేజర్-మాగార్చ్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్ ,ఆడమ్ జాంపా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com