CRICKET: కెప్టెన్‌గా అతడే అర్హుడు: అశ్విన్

ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ, రోహిత్ శర్మ దూరమయ్యారు. దీంతో కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. దీనిపై దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. "రోహిత్, కోహ్లీ ఇద్దరూ రిటైర్ అవుతారని నాకు తెలియదు. ఇది భారత క్రికెట్‌కు పరీక్షా సమయం. ఇప్పుడు గౌతమ్ గంభీర్ శకం ప్రారంభమైంది. బుమ్రా సీనియర్ ఆటగాడు. కెప్టెన్ గా అతడే సరైన ఎంపిక." అని అశ్విన్ అన్నాడు.
కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్?
బీసీసీఐకి మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక సూచనలు చేశాడు. కోహ్లీ స్థానంలో కరుణ్ నాయర్‌ను ఇంగ్లాండ్‌కు పంపించాలన్నాడు. కరుణ్ నాయర్‌కు ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని గుర్తుచేశాడు. 33 ఏళ్ల కరుణ్ నాయర్‌కు టెస్టు క్రికెట్‌లో 4వ స్థానంలో ఆడిన అనుభవం ఉంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ‘ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులోకి రావడానికి అర్హుడు. అతను నాలుగో స్థానంలో ఆడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత్‌కు ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు అవసరం. అతనికి అవకాశం లభిస్తే యువ ఆటగాళ్లకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది.దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినా గుర్తింపు రాకపోతే అది కాస్త సవాలుగా మారుతుంది’ అని కుంబ్లే వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com