Cricketer Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం.. కాలుకు తీవ్ర గాయాలు

Cricketer Rishabh Pant: ఉత్తరాఖండ్‌లో క్రికెటర్ రిషబ్ పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది.ఉత్తరాఖండ్ నంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధం అయ్యింది. గమనించిన స్థానికులు పంత్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పంత్ కాలుకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఢిల్లీ లోని హాస్పిటల్ కి రెఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ వాహనం డివైడర్ ని ఢీ కొనగానే మంటలు అంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది. కారును రిషబ్ పంతే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అభిమానులు ఆందోళనకు గురౌతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com