Sania Mirza : సానియాతో పెళ్లంటూ రూమర్స్.. స్పందించిన క్రికెటర్ షమీ
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తాను పెళ్లి చేసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్రికెటర్ షమీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఈ వార్తలు నిజం కాదు. ఇలాంటివి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటాయి. కానీ వాటివల్ల హానీ కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలి. అసత్య ప్రచారానికి దూరంగా ఉండాలి’ అని ఈ స్టార్ పేసర్ సూచించారు.
‘సానియా మీర్జాతో పెళ్లి అనేద కేవలం రూమర్స్ మాత్రమే. గుర్తింపు లేని సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఇలాంటి పోస్టు చేస్తుంటారు. దమ్ముంటే నిజమై అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు చేయండి. అప్పుడు నేనేంటో చూపిస్తా. ఇప్పుడు నా జీవితం ప్రశాంతంగా ఉంది. ఎవరో ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చి వెళ్లినంత మాత్రనా అంత సర్వనాశనం కాదు. ఇప్పుడు నా కూతురు, మా అమ్మతో హ్యపీగా లైఫ్ ను లీడ ్చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్లు.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత జీవితాల విషయానికి రావొద్దు. ఫన్, మీమ్ అంటే వేరే విషయాల్లో చేసుకోవచ్చు. కానీ ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఇంకొకరితో ముడివేస్తూ బజారుకి లాగవద్దు’ అంటూ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు షమీ. తద్వారా సానియాతో తన పెళ్లంటూ వస్తోన్న రూమర్లను కొట్టిపారేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com