Cristiano Ronaldo : క్రిస్టియానో రోనాల్డో సరికొత్త చరిత్ర

పోర్చగల్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. సోషల్ మీడియాలో 100 కోట్ల ఫాలోవర్స్ ను సొంత చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. తో అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ రొనాల్డో తాజాగా ప్రత్యేక పోస్ట్ చేశాడు. ‘మనం చరిత్ర సృష్టించాం.. 100కోట్ల ఫాలోవర్లు! ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు.. నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. ఇప్పుడు వంద కోట్ల మంది నాకోసం నిలబడ్డారు. నా ఎత్తుపల్లాల్లో, ప్రతీ అడుగులోనూ మీరున్నారు. ఇది మన ప్రయాణం. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నాపై విశ్వాసం ఉంచి.. నాకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు, నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న’’ అని రొనాల్డో రాసుకొచ్చారు. ప్రస్తుతం రొనాల్డో యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్‌స్టాలో 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com