CSK Worst Record : ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డు.. 2019 నుంచి

CSK Worst Record : ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డు.. 2019 నుంచి
X

ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డులు మూటగట్టుకుంటోంది. 2019 నుంచి ఆ జట్టు 180పైగా టార్గెట్‌ను ఛేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు ఛేజింగ్‌కు దిగగా అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు ఛేజింగ్‌లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా సీఎస్కే 180పైగా ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు గెలిచింది. ఇందులో సురేశ్ రైనా ఆడిన 13 మ్యాచుల్లో విజయం సాధించింది.

కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆర్ఆర్ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనీతో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్‌లో భాగంగా సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచులో ఆర్ఆర్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్కే 176/6 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రుతురాజ్ (63) హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ 4, ఆర్చర్, సందీప్ శర్మ ఓ వికెట్ తీశారు. ఈ సీజన్‌లో ఆర్ఆర్‌కు ఇదే తొలి విజయం. సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి.

Tags

Next Story