CT2025: నేడే దాయాదుల సమరం

క్రికెట్ ప్రపంచం అంతా నరాలు తెగే ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న మ్యాచుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు పాక్‌తో భారత్ తలపడనుంది. తొలి మ్యాచులో భారత్ గెలిచి ఊపు మీదుండగా.. ఆరంభ మ్యాచులో ఓడిన పాక్ నిస్తేజంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సెమీస్ చేరాలని టీమిండియా చూస్తుండగా.. విజయం సాధించి సెమీస్ రేసులో ఉండాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. అటు.. క్రికెట్ అభిమానులతో పాటు, మాజీ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పై ఓటమిని చవి చూసింది. దీంతో.. టీమిండియాతో జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్‌కు కీలకం కానుంది.
భారత్ కు చెలగాటం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు భారత్-పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూ ఆర్ డై మ్యాచుగా మారిపోయింది. ఈ మ్యాచ్ లోనూ ఓడిపోతే పాక్ ఈ మెగా టోర్నీ నుంచి ఇంటి దారి పడుతుంది. మరోవైపు ఈ మ్యాచులోనూ గెలిచి సెమీస్ చేరాలని భారత్ చూస్తోంది. భారత్ ఉన్న ఫామ్, పాకిస్థాన్ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచులో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలో దిగనుంది.
పాక్ జట్టుకు స్పెషల్ కోచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే పాక్ దాదాపు నిష్క్రమించినట్లే. ఈ ప్రమాదం నుంచి తప్పించుకొనేందుకు దాయాది జట్టు స్పెషల్ కోచ్‌గా మాజీ క్రికెటర్ ముదాసర్ నాజర్‌ను అపాయింట్ చేసుకుంది. దుబాయ్‌లోని పరిస్థితులపై నాజర్‌కు మంచి అవగాహన ఉంది. గతంలో పాక్, కెన్యా, యూఏఈ జట్లకు కోచ్‌గా పనిచేశాడు. మరి ఫలితం ఎలా ఉందో చూడాలి.
భారత్ కంటే పాక్ రికార్డే మెరుగు
ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా భారత్-పాక్ మ్యాచ్ గురించే చర్చించుకుంటోంది. ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే 2010 నుంచి చూసుకుంటే ఇరుజట్ల మధ్య 17 వన్డేలు జరిగితే 12 మ్యాచుల్లో భారతే విజయం సాధించింది. అయితే ఓవరాల్ వన్డే రికార్డును చూసుకుంటే పాక్ కాస్త పైచేయిగా కనిపిస్తోంది. ఇరుజట్ల మధ్య 135 వన్డేలు జరగగా, 73 వన్డేల్లో పాక్ గెలవగా, 57 మ్యాచుల్లో భారత్ గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com