CT2025: టీమిండియా గెలుపు కోసం పూజలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. మరికాసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, భారత జట్ల మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా గెలుపు కోసం ఉజ్జయినిలోని బాగ్లముఖి ఆలయం, కాశీ విశ్వేశ్వరుని మందిరంలో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదికి హారతులు ఇచ్చి, ప్రార్థనలు నిర్వహించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ సమజ్జీవులుగా కనిపిస్తున్నారు.
సైకత శిల్పంతో.. భారత్‌కు ఆల్ ది బెస్ట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో సైకత శిల్పాన్ని ప్రదర్శించాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దుబాయ్ స్టేడియం, ట్రోఫీతో పాటు వైట్ బాల్ కనిపించేలా ఇసుక శిల్పాన్ని రూపొందించి, టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.
వరుణ్ చాలా డేంజర్.. కివీస్‌కు హెచ్చరిక
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ టీంకు పెను సవాలుగా మారబోతున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్ బౌలింగ్ సెటప్ అద్భుతంగా ఉందన్న ఆయన.. చక్రవర్తి బౌలింగ్‌లో న్యూజిలాండ్ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. గ్రూప్-దశ మ్యాచ్‌లో కివీస్‌పై వరుణ్ చక్రవర్తి 10-0-42-5తో అసాధారణ గణాంకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఫైనల్‌పై జోరుగా బెట్టింగ్స్.. 5 మంది అరెస్టు
ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 నుంచి ప్రారంభం కానుంది. తుది పోరుపై దేశ వ్యాప్తంగా బెట్టింగ్స్ ఊపందుకున్నాయి. రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి నడుస్తున్న ఈ క్రికెట్ బెట్టింగ్‌లో ఐదుగురు బుకీలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుకీల నుంచి రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలోనూ జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com