Danish Kaneria : టీమిండియా పాకిస్తాన్ కు రావొద్దు : డానిష్ కనేరియా
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాక్ దక్కించుకున్నది. టోర్నీ నిర్వహణ కోసం పాక్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి సమర్పించింది. అయితే, ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. పాక్ కు వెళ్లేందుకు టీమిండియా సుముఖంగా లేదు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే మన క్రికెట్ జట్టు పాక్ కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు పాకిస్థాన్‌కు రావొద్దని సూచించాడు. ఆటగాళ్ల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, దాని తర్వాతే ఇతర విషయాలపై ఆలోచించాలన్నాడు. ‘‘పాక్ లో ప్రస్తుత పరిస్థితులు చూడండి. నేనైతే భారత జట్టు పాక్‌కు వెళ్లొద్దని చెప్తా. పాకిస్థాన్ ఈ విషయంపై ఆలోచించాలి. ఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీని దుబాయిలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆటగాళ్ల భద్రత మొదటి ప్రాధాన్యత. బీసీసీఐ అద్భుతంగా పనిచేస్తోంది. వారే నిర్ణయం తీసుకున్నా ఇతర దేశాలు అంగీకరించాలి. నాకు తెలిసి టోర్నమెంట్ హైబ్రీడ్ మోడల్‌లో జరిగే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com