IPL : ఐపీఎల్ ఫ్రాంచైజీలకు డెడ్‌లైన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రిటెన్షన్ విధానంపై ఉత్కంఠ వీడడంతో ఫ్రాంచైజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 17వ సీజన్‌లో నలుగురినే అట్టిపెట్టుకునేందుకు అనుమతిచ్చిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఈసారి ఐదుగురికి అనుమతిచ్చింది. దాంతో, పది ఫ్రాంచైజీలు రిటెన్షన్ జాబితా తయారీకి సిద్ధమవుతున్నాయి. ఎవరిని అట్టిపెట్టుకోవాలి?, ఎవరెవరిని వదిలించుకోవాలి? అనే విషయంపై ఇప్పటికే ఓ అంచనాతో ఉన్న యాజమాన్యాలు ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేశాయి.
ఎందుకంటే.. నవంబర్‌లో మెగా వేలం నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలకు రిటెన్షన్ లిస్ట్ ఇవ్వడానికి గడువు విధించింది. అక్టోబర్ 31 తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆట్టిపెట్టుకుంటున్న ఆటగాళ్ల జాబితాను తమకు సమర్పించాలని ఫ్రాంచైజీల యజమానులను ఆదేశించింది. దాంతో, నిర్ణీత సమయంలోపు లిస్ట్ పంపేందుకు పది జట్లు సిద్ధమవుతున్నాయి.బెంగళూరులో శనివారం సమావేశమైన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఫ్రాంచైజీకి ఐదుగురిని అట్టిపెట్టుకునే అవకాశం కల్పించింది. అయితే.. ఈ ఐదుగురిలో భారత ఆటగాళ్లు ఎందరు ఉండాలి? విదేశీ క్రికెటర్ల పరిమితి ఎంత? అనే నిర్ణయాన్ని ఫ్రాంచైజీలకే వదిలేసింది. అయితే రైటు టు మ్యాచ్ విధానాన్ని మాత్రం ఒక్క ఆటగాడికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈసారి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా రూ.120 కోట్లుకు పెంచింది. 17వ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీలు రూ.100 కోట్ల పర్స్‌తో మినీ వేలంలో పాల్గొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com