వావ్ ధోనీ.. చిన్ననాటి స్నేహితుడి దుకాణం పేరుతో బ్యాట్‌

వావ్ ధోనీ.. చిన్ననాటి స్నేహితుడి దుకాణం పేరుతో బ్యాట్‌

క్రికెట్ ఫ్యాన్స్ ను తన ఆటతీరుతో, కెప్టెన్సీతో అలరించిన మహేంద్ర సింగ్ ధోనీ కొత్త నిర్ణయంతో మరోసారి ఫిదా చేశారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) సర్ ప్రైజ్ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీకి సిద్ధమవుతున్న జార్ఖండ్ డైనమైట్.. 42 ఏళ్ల వయస్సులో కూడా స్టేడియానికి వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాడు.

గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ట్రోఫీని అందించిన ధోనీ.. ఈసారి ఆడతాడో లేడో అనే డౌట్ ఉండేది. అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ.. స్టేడియంలో ధోనీ సరికొత్తగా కనిపించడంతో అందరూ హ్యాపీ అవుతున్నారు. నెట్స్‌లో ప్రాక్టీస్ లో ధోనీ కొత్త బ్యాట్‌తో కనిపించాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధోని పట్టుకున్న బ్యాట్‌పై ఓ స్టిక్కర్ ఉంది. అది అతని చిన్ననాటి స్నేహితుడి దుకాణం పేరు. తన చిన్ననాటి స్నేహితుడి దుకాణం పేరు స్టిక్కర్‌ ఉన్న బ్యాట్ ను ధోనీ క్యారీ చేయడం గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్.

ప్రైమ్ స్పోర్ట్స్ అనేది ధోనీ చిన్ననాటి స్నేహితుడు పరమ్‌జిత్ సింగ్ యాజమాన్యంలోని స్టోర్. కెరీర్ ఆరంభమైన తొలినాళ్లలో పరమజిత్.. ధోనికి చేసిన సాయం చాలా ముఖ్యమైనదని ధోనీ సన్నిహితులు చెబుతున్నారు. మంచి బ్యాట్, కీపింగ్ ప్యాడ్స్, క్రికెట్ మెటీరియల్ ను ఈ షాప్ మొదటి నుంచి ధోనీకి ఇస్తూ వచ్చింది. పరమజీత్ సింగ్ కు కూడా ఫ్యాన్స్ థ్యాంక్స్ చెబుతూ మెసేజ్ లు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story