Cricket : రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు: కపిల్ దేవ్
అడిలైడ్ టెస్టులో భారత్ ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతనికి అండగా నిలిచారు. ‘రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు. అతను కొత్తగా నిరూపించడానికి ఏం లేదు. తిరిగి దృఢంగా పుంజుకుంటారని భావిస్తున్నా. ఒకట్రెండు ప్రదర్శనలతో కెప్టెన్సీని అనుమానిస్తే, అతను 6నెలల కిందటే టీ20 వరల్డ్ కప్ సాధించాడు. మరి దానిపై మనం ఏం ప్రశ్నిస్తాం’ అని కపిల్ అన్నారు.
మూడో టెస్టులో రోహిత్ శర్మ ఓపెనర్‌గా రావాలని మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ అభిప్రాయపడ్డారు. రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలన్నారు. కానీ ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలని, మూడో టెస్టులో రెడ్ కూకబురా బాల్‌తో ఆడుతారు కాబట్టి మిడిలార్డర్‌కు బ్యాటింగ్ ఈజీ అవుతుందని మరికొందరు అంటున్నారు. రెండో టెస్టులో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ రన్స్ చేయడంలో విఫలమైన సంగతి తెలిసిందే.
రోహిత్, కోహ్లీ టీమ్‌ఇండియాకు అందించిన సేవలు వెల కట్టలేనివి. కానీ కొన్నాళ్లుగా వీరు టెస్ట్ జట్టుకు భారంగా మారుతున్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెండో టెస్టుతో సహా కొన్నాళ్లుగా విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కోహ్లీ తొలి టెస్టులో సెంచరీ చేసినా ఆఫ్‌సైడ్ బంతుల్ని వెంటాడి మరీ ఔట్ అవుతున్నారు. జూనియర్లకు ఆదర్శంగా నిలవకుండా జట్టుకు భారంగా మారడం టెస్టు విజయాలపై ప్రభావం చూపే అంశమే
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com