Cricket : ఆస్ట్రేలియాకు ఛాన్స్‌ ఇవ్వొద్దు : రవిశాస్త్రి

Cricket : ఆస్ట్రేలియాకు ఛాన్స్‌ ఇవ్వొద్దు : రవిశాస్త్రి
X

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటే టీమిండియా అత్యున్నత స్థాయి ఆటతీరును ప్రదర్శించాల్సిందే అని మాజీ కోచ్‌ రవిశాస్త్రి తేల్చి చెప్పాడు. ఓ ఆంగ్ల క్రీడా ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘కొన్ని కఠినమైన విషయాలు చెబుతా. ఇక్కడ కోచ్‌గా మూడు పర్యటనలకు వచ్చిన అనుభవంతో చెబుతున్నాను.. ప్రతి ఆటగాడు అత్యున్నత స్థాయిలో ఆడాల్సిందే. ఆసీస్‌ చేసే తప్పిదాలను ఒడిసి పట్టుకోవడానికి మీరు పూర్తిస్థాయి సంసిద్ధతతో ఉండాలి. ప్రత్యర్థికి ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా ఉండటమే ఏకైక మార్గం. అంతకు మించి మరో దారేలేదు. యశస్వి జైస్వాల్‌ ఈ పర్యటన ముగిసేనాటికి మరింత మెరుగైన బ్యాటర్‌గా అవతరిస్తాడు. అతడు ప్రపంచ శ్రేణి ఆటగాడు. అతడు ఇంగ్లాండ్‌పై స్వేచ్ఛగా ఆడటం మీరు చూశారు. అతడు చాలా శ్రమించి ఆ స్థాయికి వచ్చాడు. పరుగుల దాహం.. ఆడాలన్న కసి అతడి కళ్లలో కనిపిస్తాయి. ఆటలో మమేకమైపోవాలనుకుంటాడు’ అని పేర్కొన్నాడు.

Tags

Next Story