Suryakumar Yadav : పాక్‌తో మ్యాచ్‌ను ప్రత్యర్థి పోరుగా చూడొద్దు - సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ సూపర్-4లో పాకిస్థాన్‌పై భారత జట్టు సాధించిన విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గత ఆరు మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా భారత్‌పై పాక్ విజయం సాధించలేదన్న గణాంకాలను ప్రస్తావిస్తూ.. పాక్‌ను ఇకపై తమకు ప్రత్యర్థి అని పిలవొద్దని సూర్య పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. "ఇకపై పాకిస్థాన్‌ను ప్రత్యర్థి అని పిలవడం మానేద్దాం. నా అభిప్రాయం ప్రకారం.. రెండు జట్లు 20 మ్యాచ్‌లు ఆడినప్పుడు, వాటి మధ్య విజయావకాశాలు 11-9 లేదా 10-10గా ఉంటేనే వాటిని సరైన ప్రత్యర్థులు అనవచ్చు. కానీ 13-0 లేదా 10-1 వంటి గణాంకాలు నమోదైతే అక్కడ పోటీ ఏముంది? ప్రత్యర్థి అని పిలిచేంత ఏమీ లేదు" అని అన్నారు.
మ్యాచ్‌లకు మైదానం పూర్తిగా నిండటం గురించి మాట్లాడుతూ.. "మా జట్టులోని ప్రతి ఒక్కరూ అభిమానులను అలరించడానికే వచ్చాం. పాకిస్థాన్‌పై మేము అత్యుత్తమ క్రికెట్ ఆడాం కాబట్టి విజయం సాధించాం" అని సూర్య పేర్కొన్నారు. అలాగే ఈ మ్యాచ్ జరిగిన పిచ్ గత వారం ఆడిన పిచ్ కంటే బాగుందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని ఆయన తెలిపారు. "ఏ జట్టు అయితే 7 నుంచి 15 ఓవర్ల మధ్య మెరుగైన ఆటతీరు కనబరుస్తుందో, ఆ జట్టే గెలుస్తుంది. ఈ విషయంలో మేము పైచేయి సాధించాం" అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com