Dwayne Bravo : క్రికెట్‌కు డ్వేన్ బ్రావో వీడ్కోలు.. సీసీఎల్లే ఆఖరి టోర్నీ

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. 41 ఏళ్ల బ్రావో 2015లో టెస్టులు, 2021లో వన్డేలు, టీ20లకు వీడ్కోలు పలికాడు. కమర్షియల్ లీగ్స్ లో ఇన్నాళ్లు ఆడాడు. ఐతే.. తాజాగా దేశీయ, విదేశీ లీగ్ మ్యాచులకు సైతం వీడ్కోలు పలికారు. మొత్తం ఫ్రాంచైజీ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
ప్రస్తుతం సొంతదేశంలో కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నారు బ్రావో. ప్రొఫెషనల్ క్రికెట్లో తనకు ఇదే చివరి టోర్నీ అని తాజాగా 'ఇన్స్టా' వేదికగా ప్రకటించాడు. బ్రావో సీపీఎల్ లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో 582 టీ20ల్లో 6,970 పరుగులతో పాటు 631 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగులో మొన్నటి వరకు చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఆడిన బ్రావో.. 161 మ్యాచులు ఆడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com