ఈఫిల్‌‌‌‌ టవర్‌‌‌‌ ఇనుముతో.. పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

ఈఫిల్‌‌‌‌ టవర్‌‌‌‌ ఇనుముతో..  పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ మెడల్స్‌‌‌‌

పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ (Paris Olympics), పారాలింపిక్స్‌‌‌‌ మెడల్స్‌‌‌‌కు సంబంధించిన డిజైన్‌‌‌‌ను నిర్వాహకులు గురువారం వెల్లడించారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక ఈఫిల్‌‌‌‌ టవర్‌‌‌‌ నుంచి సేకరించిన ఇనుముతో ఈ పతకాలను రూపొందిస్తున్నారు. షడ్భుజి ఆకారంలో డైమండ్‌‌‌‌ను పోలిన ఓ ఇనుప ముక్కను ఆరు చిన్న చేతులు బంధించినట్లుగా ఉంటుంది. దాని చుట్టు గోల్డ్‌‌‌‌, సిల్వర్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ డిస్కులను ఏర్పాటు చేశారు. అవి కాంతిని ప్రతిబింబించేలా ఒక యాంగిల్‌‌‌‌లో రూపొందించనున్నారు.

మెడల్‌‌‌‌ లోపల ఉంచే ఇనుప ముక్క బరువు 18 గ్రాములు. ఈఫిల్‌‌‌‌ టవర్‌‌‌‌ను 18,038 విడిభాగాలతో రూపొందించిన దానికి గుర్తుగా ఆ బరువును ఉపయోగిస్తున్నారు. ఒలింపిక్స్‌‌‌‌ కోసం మొత్తం 5084 మెడల్స్‌‌‌‌ను ఫ్రెంచ్‌‌‌‌ అభరణాల సంస్థ చౌమెట్‌‌‌‌ తయారు చేస్తున్నది. 2600 ఒలింపిక్స్‌‌‌‌ కోసం కాగా, 2400 పారాలింపిక్స్‌‌‌‌కు వాడనున్నారు. మిగతా వాటిని రిజర్వ్‌‌‌‌ చేయనున్నారు.

గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మొత్తం బరువు 529 గ్రాములు. వెండితో రూపొందించి ఆపై 6 గ్రామ్‌‌‌‌ల గోల్డ్‌‌‌‌ కోట్‌‌‌‌ వేస్తారు. సిల్వర్‌‌‌‌ మెడల్ 525 గ్రామ్స్‌‌‌‌, బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ 455 గ్రామ్స్‌‌‌‌గా ఉంది. 85 మిల్లీ మీటర్ల వ్యాసంతో ఉండే మెడల్‌‌‌‌ మందం 9.2 మిల్లీ మీటర్లు. ఈఫిల్‌‌‌‌ టవర్‌‌‌‌ గిర్డర్‌‌‌‌లు, ఇతర బిట్స్‌‌‌‌ నుంచి సేకరించిన ఇనుముతో మెడల్స్‌‌‌‌ను తయారు చేస్తున్నామని గేమ్స్‌‌‌‌ ఆర్గనైజింగ్‌‌‌‌ కమిటీ డిజైన్‌‌‌‌ హెడ్‌‌‌‌ జోచిమ్‌‌‌‌ రాన్సిన్‌‌‌‌ వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story