ENG vs IND : ఇంగ్లండ్‌ను ఓడించిన భారత మహిళలు

మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ముంబై వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. అంతేకాక.. కేవలం ఒకేఒక్క సెషన్ లో పది వికెట్లను తీసి సంచలన విజయం నమోదు చేసింది. నాలుగు రోజులపాటు జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఇంతకుముందు ఏ జట్టు ఇంత భారీ విజయాన్ని నమోదు చేయలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం ఇంగ్లాండ్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నా రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 186 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం... బ్రిటీష్ మహిళల జట్టును రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూల్చి... 347 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై తొమ్మిది వికెట్లు నేలకూల్చి దీప్తి శర్మ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా దీప్తి శర్మ ఎంపికైంది.
భారత్ ఉమెన్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 428 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా జట్టు కేవలం 136 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి కేవలం 5.3 ఓవర్లు వేసి ఐదు వికెట్లు తీసింది. ఆ తరువాత రెండో ఇన్సింగ్ లో భారత్ జట్టు ఆరు వికెట్లు కోల్ప్యి 186 పరుగులు చేసింది. 479 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్లు భారత్ బౌలర్ల దాటికి క్రీజులో నిలవలేక పోయారు. భారత్ స్పిన్నర్లు దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ చెలరేగడంతో మూడోరోజు తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ బ్యాటర్లు 131 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ మహిళల జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో భారీ విజయాన్ని నమోదు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com