IND vs ENG : మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ఇదే

టీమిండియాతో జరగబోయే మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో మార్క్ వుడ్ తిరిగి జట్టులో తీసుకుంది. రాజ్‌కోట్ వేదికగా రేపటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది.
మరోవైపు ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే మిగితా మూడు టెస్టులకు భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఈ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. గాయపడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలను కూడా జట్టులో ఉంచారు.ఫిట్ నెస్ బట్టి జడేజా, రాహుల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్ కు చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ తుది జట్టు:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ , కెఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్.సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com