England vs Australia : ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
ఆస్ట్రేలియాతో T20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్ తగిలింది. కాలి కండరాల గాయంతో ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. అలాగే వన్డే సిరీస్‌లో కూడా ఆయన ఆడటం అనుమానంగా మారింది. ప్రస్తుతం ఆయన స్థానంలో ఫిల్ సాల్ట్‌ను కెప్టెన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ ఎంపిక చేసింది. బట్లర్ స్థానంలో ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 11 నుంచి T20 సిరీస్ ప్రారంభం కానుంది.
కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.
ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్
ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com