Eng vs Aus : మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం

మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మంగళవారం చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఆసీస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ డక్‌వర్త్-లూయిస్ ప్రకారం 46 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియా 14 వరుస విజయాలకు బ్రేక్ పడింది.ఈ మ్యాచులో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 304 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ తరుపున వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(77 పరుగులు 65 బంతుల్లో), స్టీవ్ స్మిత్(60 పరుగులు 82 బంతుల్లో) రాణించారు. ఇంగ్లండ్ తరుపున జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, కార్సే, బెతేల్, విల్ జాక్స్, లివింగ్ స్టన్ చెరో ఒక వికెట్ తీశారు. అనంతరం 305 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది.11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి నష్టాల్లో ఉన్న ఆ జట్టును కెప్టెన్ హ్యారీ బ్రూక్(110 , 13 ఫోర్లు,2 సిక్సులు), విల్ జాక్స్(84, 9 ఫోర్లు,1 సిక్సు) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ భాగ్యస్వామ్యానికి 156 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ 37.4 ఓవర్లలో 254/-4 వద్ద ఉన్నప్పుడు వర్షం పడింది. దీంతో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్- లూయిస్ పద్ధతి ప్రకారం 46 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు.సెంచరీతో జట్టుని గెలిపించిన ఇంగ్లండ్ కెప్టెన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 2–1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. కాగా నాలుగో వన్డే లండన్ వేదికగా సెప్టెంబర్ 27న జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com