Danielle Wyatt : ప్రేయసిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్

Danielle Wyatt : ప్రేయసిని పెళ్లి చేసుకున్న మహిళా క్రికెటర్
X

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జియా హోడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 22న వీరి పెళ్లి ఫ్రాన్స్‌లో జరగగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గతేడాది మార్చిలో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాగా వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 160 వన్డేలు, 112 టీ20లు, 2 టెస్టులు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 4,864 పరుగులతోపాటు 77 వికెట్లు కూడా తీశారు.

అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి డేనియల్ వ్యాట్ 2014లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ తల్లి ఈ సంబంధాన్ని అంగీకరించలేదంట. కపిల్ శర్మ షోలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో టీ20 ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ డేనియల్ వ్యాట్ తనకు ప్రపోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ సమయంలో కోహ్లీ బిజీగా ఉన్నందున ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే కోహ్లీకి ఇంకా పెళ్లి వయసు రాలేదని అతని తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ కథ ముగిసింది.

Tags

Next Story