Afghanistan: సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయండి..ముందు జాగ్రత్త కోసమే..!

Afghanistan: సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయండి..ముందు జాగ్రత్త కోసమే..!
Afghanistan: అఫ్గన్ తాలిబన్ల వశమైన దగ్గర నుంచి ఆ దేశంలో భయానవాతావరణం కొనసాగుతుంది.

Afghanistan: అఫ్గాన్ తాలిబన్ల వశమైన దగ్గర నుంచి ఆ దేశంలో భయానవాతావరణం కొనసాగుతుంది. ఆ దేశంలో మహిళలకు గతంలో తాలిబన్ల పాలనలో జరిగిన భయానక అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. దాంతో భవిష్యత్తుపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌కు చెందిన ఉమెన్ సాకర్ జట్టు మాజీ కెప్టెన్ క్రీడాకారుణుల్ని అప్రమత్తం చేశారు. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేయాలని, సామాజిక మాధ్యమాల్లో ఖాతాను పూర్తిగా తొలిగించాలని చెప్పింది. క్రీడా వస్తులు కూడా కాల్చివేలాలంటూ హెచ్చరించింది.

ఈ క్రమంలో అఫ్గాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ లీగ్ వ్యవస్థాపకురాలు కోపెన్‌ హాగెన్‌లో నివసిస్తోన్నారు. ఎప్పుడూ యువతులకు ధైర్యం నూరిపోస్తుంది. అయితే ఈ సారి అందుకు బిన్నంగా స్పందించడం గమనార్హం. ఈ సందర్భంగా ఖలీదా మాట్లాడుతూ.. 'ఒక విషయం చెప్తున్నా. మీ గుర్తులను చెరిపేయండి. మీ ఫొటోలను తొలిగించండి. మీ జాతీయ జట్టు యూనిఫాంను తగులబెట్టండి. లేదంటే వదిలించుకోండి. ఒక జాతీయ క్రీడాకారిణిగా ఎదిగేందుకు ఎంతో కృషి చేసిన మనకు ఇది చాలా బాధాకరవిషయం' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్ల రాకతో మహిళల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందన్నారు.

ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియదు. ప్రమాదం వచ్చిన రక్షించే వారు ఎవరు లేరు..అని చెప్పుకొచ్చాచరు. తాలిబన్లు ఇస్లామిక్ చట్టాల పరిధిలో మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్తున్నారు. గత పాలన ఉండదని మీడియాతో కూడా చెప్పారు. మహిళల్లో అందోళన అవసరం లేదని, ఎప్పటిలానే వారు ఉద్యోగాలకు వెళ్లాలని చెప్పారు. తాలిబన్లు మాటలు ఎంత వరకు నిజమో తెలియదు.

Tags

Read MoreRead Less
Next Story