India Vs Australia: మూడో వన్డే ఆసిస్‌దే

ప్రపంచకప్‌నకు ముందు సన్నాహకంగాఆ్రస్టేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆ్రస్టేలియా 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 96, స్టీవ్ స్మిత్ 74, లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులతో రాణించారు. 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అదిరే ఆరంభం దక్కింది. అయినా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ 81, విరాట్ కోహ్లి 56, శ్రేయస్ అయ్యర్ 48, రాణించారు... శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టుకి మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. 57 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో రోహిత్ 81 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కూడా అర్థశతకం బాదాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 48 పరుగులకే వెనుదిరిగాడు. ఈ ముగ్గురు మినహాయించి జట్టులో మరెవ్వరూ రాణించకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటాడు కానీ, తన 10 ఓవర్ల కోటాలో 81 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లు తీసి, భారత్ పతనాన్ని శాసించాడు. హాజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ గ్రీన్, తన్వీర్ సంఘా తలా వికెట్ తీశారు. సిరీస్‌లో 178 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
మొదటి రెండు వన్డే మ్యాచ్ లు గెలుచుకున్న టీం ఇండియా.. మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. వరుస విజయాల ఊపులో మరో మ్యాచ్ గెలిచి ఆ్రస్టేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా కోరిక నెరవేరలేదు. ఆ్రస్టేలియా సమష్టి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని తమ వరుస ఐదు పరాజయాలకు బ్రేక్ వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com