Team India Head Coach : టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్?

Team India Head Coach : టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్?

ఇండియా క్రికెట్ టీం హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైన ట్లు తెలుస్తోంది. ఇక ప్రకటనే తరువాయి అన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్ కతాకు మెంటార్గా ఉన్న గంభీర్.. ఆ జట్టు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో టీమిండియా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు.. ఆ వర్గాలకు దగ్గరగా ఉండే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు వార్తలు అతడినే వస్తున్నాయి.

ఈ మేరకు క్రిక్బజ్ కూడా ఓ రిపోర్ట్ విడుదల చేసింది. కేకేఆర్ మెంటార్ గంభీర్ చేసిన కృషి అతడిని ఈ పదవికి తీసు కొచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల టీం ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ కు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అందుకు దర ఖాస్తుల గడువు కూడా ముగిసింది.

Tags

Next Story