Shubman Gill : 47 ఏళ్ల సునీల్ గవాస్కర్ రికార్డు బద్దలు కొట్టిన గిల్

భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ భారత కెప్టెన్‌గా 732 పరుగులు సాధించాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో భారత కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ రికార్డు సుమారు 47 ఏళ్ల పాటు పదిలంగా ఉంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత ఐదు టెస్టుల సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ గవాస్కర్ రికార్డును అధిగమించి, కొత్త రికార్డు సృష్టించాడు. ఓవల్‌లో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ 11 పరుగులు చేయగానే ఈ ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 737 పరుగులు* (మొదటి ఇన్నింగ్స్‌లో) సాధించాడు. గిల్ ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. అతను నాలుగు సెంచరీలు సాధించాడు, అందులో ఒక డబుల్ సెంచరీ (269 పరుగులు) కూడా ఉంది. కెప్టెన్‌గా గిల్‌కు ఇది మొదటి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. తొలి సిరీస్‌లోనే ఈ రికార్డును సాధించి తన నాయకత్వ ప్రతిభను కూడా నిరూపించుకున్నాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com