Captain Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. రికార్డులు బద్ధలు

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ గిల్ అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సులతో 200 రన్స్ చేశాడు. టెస్టుల్లో గిల్‌కు ఇది తొలి డబుల్ సెంచరీ. ఈ నేపథ్యంలో గిల్ ఓ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అజారుద్దీన్ పేరిట ఉంది. అజహరుద్దీన్ 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 రన్స్ చేశాడు.
అంతేగాకుండా విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో టీమిండియా కెప్టెన్‌గానూ గిల్ చరిత్ర సృష్టించాడు.2016లో కోహ్లీ వెస్టిండీస్‌పై 200 రన్స్ చేశాడు. SENA దేశాల్లో శతకం చేసిన తొలి ఆసియా కెప్టెన్‌గానూ గిల్ రికార్డ్ నమోదు చేశాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్‌గానూ నిలిచాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ (7), మన్సూర్ అలీ ఖాన్, సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, ధోనీ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు. 2003 తర్వాత ఇంగ్లాండ్‌పై ద్వి శతకం చేసిన తొలి విదేశీ ఆటగాడు గిల్‌యే కావడం విశేషం. ఇలా ఒక్క డబుల్ సెంచరీతో గిల్ సరికొత్త రికార్డులు నమోదు చేశాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com