Graham Thorpe : ఆయనది ఆత్మహత్య కాదు : ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కుటుంబం
ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్‌ది సహజ మరణం కాదని ఆయన కుటుంబం వెల్లడించింది. డిప్రెషన్, ఆందోళన కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారని పేర్కొంది. ఇంగ్లండ్ తరఫున 100 టెస్టులాడిన గ్రాహం ఈ నెల 5న కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారని అందరూ అనుకున్నారు. హెల్త్ బాగాలేకపోవడంతో కుటుంబానికి భారంగా మారానని బాధపడుతూ ఉండేవారని థోర్ప్ భార్య తెలిపారు. ఆ బాధతోనే సూసైడ్ చేసుకున్నారని వివరించారు.
కాగా 55 ఏళ్ల థోర్ప్ మరణవార్త ఆగష్టు 5న వెల్లడైంది. 2022లో అఫ్గానిస్తాన్‌కు హెడ్ కోచ్‌గా నియమితుడైన థోర్ప్.. అప్పటి నుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. అయితే స్పష్టమైన వ్యాధి, ఏ రకమైన అనారోగ్యమన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా... ఆయన భార్య అమెండా వ్యాఖ్యలతో థోర్ప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం బయటకు వచ్చింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com