U-19 T20 Trisha : త్రిషకు గ్రాండ్ వెల్కమ్ .. హైదరాబాద్ చేరుకున్న భద్రాచలం బిడ్డ

టీమిండియా అండర్19 టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ గొంగడి త్రిష హైదరాబాద్లోచేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెకు హెచ్ సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా త్రిష మాట్లాడుతూ జట్టు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందన్నారు. ఇకపై మరింత కష్టపడి సీనియర్ జట్టులో చోటు సాధించడమే తన లక్ష్యమని చెప్పారు. తన ప్రతి విజయంలో నాన్న ఉన్నారన్నారు. ద్రితి మంచి ప్లేయర్ అని, ఈసారి అవకాశం రాలేదని తెలిపారు. అమ్మాయిలు స్పోర్ట్స్ ను తమ కెరీర్ గా ఎంచుకోవచ్చని, సత్తా చాటితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నా రు. కాగా వరల్డ్ కప్ లో త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది. అంతేగాక ఈ టోర్నీలో నమోదైన ఏకైక శతకం చేసింది కూడా మన త్రిషనే. కాగా, త్రిష స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. రెండేళ్ల వయసుకే బ్యాట్ పట్టిన త్రిష... 9 ఏళ్లకే హైదరాబాద్ అండర్-16 జట్టుకు ఆడి సత్తా చాటింది. ఆ తర్వాత అండర్-23 కేటగిరీలోనూ ఆడింది. 19 ఏళ్లకే స్టార్ క్రికెటర్‌గా, టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగిన త్రిష భవిష్యత్తులో భారత జట్టుకు సారథ్యం వహించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com