Cricket : మా అబ్బాయికి తీవ్ర అన్యాయం: అభిమన్యు ఈశ్వరన్ తండ్రి అసహనం

టీమిండియా క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్, తన కుమారుడికి భారత జట్టులో అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్నప్పటికీ, సెలెక్టర్లు అభిమన్యును పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. టీమిండియా క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్, తన కుమారుడికి భారత జట్టులో అవకాశం దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనలు కనబరుస్తున్నప్పటికీ, సెలెక్టర్లు అభిమన్యును పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నమెంట్‌లలో అభిమన్యు ఈశ్వరన్ నిలకడగా పరుగులు సాధించాడు. గత ఏడాది కాలంలో అతను సుమారు 864 పరుగులు చేశాడు. అయినప్పటికీ, సెలెక్టర్లు అతడిని విస్మరించి, వేరే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంపై రంగనాథన్ ప్రశ్నించారు. పీఎల్ ప్రదర్శనల ఆధారంగా కొందరు ఆటగాళ్లను టెస్ట్ జట్టులోకి తీసుకుంటున్నారని, ఇది టెస్ట్ క్రికెట్ ఎంపికకు సరైన విధానం కాదని రంగనాథన్ వాదించారు. టెస్ట్ క్రికెట్‌కు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి టోర్నమెంట్‌లలోని ప్రదర్శనలనే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ నిరంతర నిరీక్షణ వల్ల తన కుమారుడు మానసికంగా కుంగిపోతున్నాడని, ఇది అతడిని తీవ్ర డిప్రెషన్‌లో పడేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com