GULVIR SINGH: చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ మెరిశాడు. దక్షిణ కొరియాలోని గుమిలో మంగళవారం ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తొలి రోజున భారత్ శుభారంభం చేసింది. పురుషుల 10,000 మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ బంగారు పతకంతో మెరిశాడు. 26 ఏళ్ల గుల్వీర్ 28 నిమిషాలు 38.63 సెకన్లలో పరుగు పూర్తి చేసి భారత్ ఖాతాలో తొలి స్వర్ణాన్ని చేర్చాడు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన మూడో భారతీయుడిగా గుల్వీర్ నిలిచాడు. హరి చంద్ (1975), జి. లక్ష్మణన్ (2017) ఈ ఘనత సాధించాడు. జపాన్‌కు చెందిన మెబుకి సుజుకీ రజతం (28:43.84), బహ్రెయిన్‌కు చెందిన ఆల్బర్ట్ కిబిచీ రాప్ కాంస్యం (28:46.82) గెలుచుకున్నారు. 20 కిలోమీటర్ల రేస్ వాక్‌లో సర్విన్ సెబాస్టియన్ భారత్‌కు తొలి పతకం తీసుకొచ్చాడు. గంట 21 నిమిషాలు 13.60 సెకన్లలో ముగించి కాంస్య పతకం సాధించాడు. ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి 58 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా, గతసారి భారత్ 27 పతకాలు గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com